Latest News Details

18,188 students qualified in IIT JEE advanced

Published on Aug 3 2018 | Updated on Aug 3 2018
18,188 students qualified in IIT JEE advanced
ఈ ఏడాది 18,188 మంది అభ్యర్థులు మాత్రమే ఐఐటీ-జేఈఈ(ఆడ్వా న్స్డ్) పరీక్షలో అర్హత సాధించారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిం చిన సీట్లు భర్తీ అయ్యేలా ప్రభుత్వం జోక్యం చేసుకుందని వెల్లడించారు. రాజ్య సభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో జావడేకర్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. గతేడాది 51,040 మంది అభ్యర్థులు ఐఐటీ-జేఈఈ (ఆడ్వా న్స్డ్) పరీక్షలో అర్హత సాధించారని.. ఈ ఏడాది ఆ సంఖ్య 18,188కి తగ్గిం దని ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయించిన సీట్లు భర్తీ అయ్యేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఐఐటీ మండలిని తాము ఆదేశించినట్లు తెలిపారు. దీంతో 81,988 మందితో విస్తృత జాబితాను వారు విడుదల చేశారన్నారు. ప్రభుత్వ ముందుచూపుతో ఈ ఏడాది 11,961 సీట్లు భర్తీ అయ్యాయని.. గతేడాది కేవలం 10,876 సీట్లే నిండాయని వివరించారు. ఈ ఏడాది కేవలం 118 సీట్లు ఖాళీగా మిగిలాయని చెప్పారు. మరో వైపు, ఐఐటీల్లో మహిళల సంఖ్య పెరుగుతోందని జావడేకర్ తెలిపారు. గతే డాది ఐఐటీల్లో విద్యార్థినుల శాతం 2.15 శాతంగా ఉందని.. ఈ ఏడాది 15. 29 శాతానికి పెరిగిందని వెల్లడించారు.

MORE IN THIS SECTION